Chodavaram: పెన్షన్ల నమోదుపై టిడిపి శ్రేణులకు ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు మార్గదర్శనం
Chodavaram: సెప్టెంబర్ 16తో కొత్త పెన్షన్ల నమోదు గడువు ముగుస్తున్నందున అర్హులందరితో దరఖాస్తు చేయించాలని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు పార్టీ శ్రేణులకు సూచించారు.
Chodavaram: పెన్షన్ల నమోదుపై టిడిపి శ్రేణులకు ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు మార్గదర్శనం
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షన్ల అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల నమోదు గడువు సెప్టెంబర్ 16వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో కొత్త పెన్షన్ దరఖాస్తులను నమోదు చేయించాలని పార్టీ నాయకులకు సూచించారు.
అలాగే, ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ను తొలగించే అంశంపై కూడా ఎమ్మెల్యే గారు చర్చించారు. ఈ సమస్యను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తాను మరియు ఇతర ఎమ్మెల్యేలు నేరుగా తీసుకెళ్లగా, ఈ అంశంపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారి నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు తెలిపారు.
పెన్షన్ అర్హతకు సంబంధించి నాయకులకు ఉన్న సందేహాలను కూడా ఎమ్మెల్యే కేఎస్ ఎన్ నివృత్తి చేశారు. ముఖ్యంగా వితంతు పెన్షన్లకు సంబంధించిన వయోపరిమితి అంశంపై విజయవాడలోని PDDRA అధికారులతో తాను వ్యక్తిగతంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.




