Chodavaram: చోడవరం పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు!

Chodavaram: చోడవరం పి.ఎస్.పేటలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 1 Sept 2026 12:10 PM IST
Chodavaram
X

Chodavaram: చోడవరం పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు!

Chodavaram: చోడవరం నియోజకవర్గం పరిధిలోని చోడవరం మండలం పి.ఎస్.పేట గ్రామంలో నిర్వహించిన “పేదల సేవలో పెన్షన్ పంపిణీ” కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కేఎస్ఎన్‌ఎస్ రాజు మరియు ఆర్‌యూడీఏ (RUDA) చైర్మన్, రాజానగరం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్, తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రీ బొడ్డు వెంకట రమణ చౌదరి కలిసి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న ఎన్ టీ ఆర్ భరోసా పెన్షన్‌ ద్వారా వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతోందని నాయకులు పేర్కొన్నారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని వారు తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story