Anakapalli: హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు అరాచకం

Anakapalli: రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను చోడవరం కూటమి ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు తీవ్రంగా ఖండించారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 14 Jun 2026 5:07 PM IST
Anakapalli
X

Anakapalli: హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలు అరాచకం

Anakapalli: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోమ్ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి పట్ల మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను చోడవరం శాసన సభ్యులు శ్రీ కె.ఎస్.ఎన్.ఎస్. రాజు గారు తీవ్రంగా ఖండించారు.

ప్రజా జీవితంలో ఉన్న నాయకులు హుందాతనం, సంస్కారం పాటిస్తూ మాట్లాడాలని, వ్యక్తిగత విమర్శలు మరియు మహిళలను అవమానించే విధమైన వ్యాఖ్యలు సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర హోమ్ మంత్రిగా అనిత గారు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత స్థాయికి దిగజారి వ్యాఖ్యలు చేయడం తగదని శ్రీ రాజు గారు అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలను ప్రజలు కూడా సహించరని, రాజకీయాల్లో పరస్పర గౌరవం మరియు విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ పైన మీరు ఇలాంటి వ్యాఖ్యలు మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేశారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story