Chodavaram: చోడవరంలో 23 మద్యం దుకాణాల రెన్యువల్.. ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఇవే!

Chodavaram: చోడవరం ఎక్సైజ్ పరిధిలోని 23 మద్యం షాపుల రెన్యువల్ ఉత్తర్వులు విడుదలయ్యాయి. రెన్యువల్ చేసుకోని దుకాణాలకు లాటరీ ద్వారా కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 12 Sept 2026 7:11 PM IST
Chodavaram
X

Chodavaram: చోడవరంలో 23 మద్యం దుకాణాల రెన్యువల్.. ఎక్సైజ్ శాఖ నిబంధనలు ఇవే!

Chodavaram: ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్, చోడవరం పరిధిలోగల 23 మద్యం షాపులను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రెన్యువల్ చేయడం జరుగుతుంది. రెన్యువల్ చేయడానికి షాపు యొక్క లైసెన్స్ ఫీజులో 38% అనగా Rs.27,20,000/-లక్షలు మరియు గీత కులాలకు సంబిందించిన మద్యం షాప్ వారు Rs.13,60,400/- అమౌంట్ను రెన్యువల్ RET కింద జమ చేయవలసి ఉంటుంది.

దీనికి అదనంగా Rs.5000 /-ప్రాసెసింగ్ ఫీజ్. లైసెన్సీ ఫీజు Rs.71, 50,000 /-ను నాలుగు ఇన్స్టాల్మెంట్స్ అనగా ఒక ఇన్స్టాల్మెంట్ Rs.17, 87, 500/-ప్రకారం మరియు పర్మిట్ రూమ్ లైసెన్స్ ఫీజు Rs.7,50,000 /-ను మూడు ఇన్స్టాల్మెంట్స్ అనగా ఒక ఇన్స్టాల్మెంట్ Rs.2,50,000 /-ప్రకారం జమ చేయవలసి ఉంటుంది.

ఎవరైనా లైసెన్సీదారుడు రెన్యువల్ చేసుకోకపోతే సదరు షాపులను జిల్లా గెజిట్నందు నోటిఫికేషన్ ఇచ్చి తదుపరి అప్లికేషన్స్ ఆహ్వానించి డ్రా ద్వారా షాపును కేటాయించడం జరుగుతుంది.

దీనికి నాన్ రిఫండబుల్ ఫీజు Rs. 3,00,000 చెల్లించి అప్లై చేసుకోవచ్చును మరియు ప్రాసెసింగ్ ఫీజ్ Rs.1000 రూపాయలు. ప్రతి షాప్ కు మినిమమ్ 4 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తే మాత్రమే డ్రా తీయబడును. ఒకవేళ 04 అప్లికేషన్స్ రాకపోతే అప్లికేషన్ ఫీజ్ మొత్తం అమౌంట్ను రిటర్న్ చేయబడును. మద్యం షాపులకు సంబంధించి సమాచారం కొరకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ చోడవరం ను సంప్రదించవలసినదిగా కోరడమైనది.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM