Chodavaram: చోడవరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమ మద్యంపై ఉక్కుపాదం!
Chodavaram: చోడవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యం, నాటుసారాయీపై దాడులు. ప్రత్యేక డ్రైవ్‌లో 6గురి అరెస్ట్, వేలాది లీటర్ల బెల్లం ఊటల ధ్వంసం.
Chodavaram: చోడవరం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో అక్రమ మద్యంపై ఉక్కుపాదం!
Chodavaram: డైరెక్టర్,ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్, ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తేదీ 01.09.2026 నుండి ఇప్పటివరకు సుమారు 6 కేసులలో అనధికార మద్యం షాపులు నిర్వహిస్తున్న 6గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారు వద్ద నుండి 11.18 లీటర్ల మద్యం ను స్వాధీనం పరుచుకోవడం అయినది మరియు నాటు సారాయి అమ్మకాలు జరుపుతున్న ఒకరిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 2 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకోవడం జరిగినట్లు
అదేవిధంగా చోడవరం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాలుగు మండలాలు చోడవరం, బుచ్చయ్యపేట, కే.కోటపాడు మరియు దేవరాపల్లి లో గత రెండు సంవత్సరాలు సమయంలో సుమారు 134 కేసులలో 100 మంది పై నాటు సారాయి కేసులు పెట్టడం జరిగినదని
అలాగే వారు వద్ద నుండి 571.52 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకుని సీజ్ చేసి
మరియు నాటు సారాయి తయారికి ఉపయోగించే సుమారు 5653 కేజీల నల్ల బెల్లం మరియు 41180 లీటర్ల పులిసిన బెల్లం ఊటలను ధ్వంసం చేయడం జరిగినట్లు
అలాగే గ్రామాలలో అనాధికార మద్యం అమ్మకాలు(బెల్ట్ షాప్ లు నిర్వహించిన) జరిపిన వారిపై 210 కేసులలో సుమారు 211 మందిపై కేసులు పెట్టి సుమారు 512.61 లీటర్ల మద్యం ను స్వాధిని పరచుకోవడం జరిగినట్లు, అందులోనే రెండు ద్విచక్ర వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగిందని .
గత రెండు సంవత్సరాల్లో జరిగిన లోక్ అదాలత్ లలో అనధికార మద్యం అమ్మకందారులు నుంచి సుమారు 257 కేసులలో 14,09,691/- రూపాయలు గవర్నమెంట్ కు చలానా రూపంలో జరిమానా కట్టించడం జరిగినది. అదేవిధంగా సత్ప్రవర్తనకోసం బైండోవర్ చేసిన 06 ముద్దాయిలు సదరు బైండోవర్ ఉల్లంఘించిన నేరంగాను వారినుంచి 70 వేలు రూపాయలు ఫైన్ ద్వారా వసూలు చేయడం జరిగిందని చోడవరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పాపు నాయుడు తెలిపారు
అదేవిధంగా నాటు సారా తయారు చేసినా అమ్మకాలు జరిపినా కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.




