Chintoor: ఎంబీబీఎస్ సీటు సాధించిన వర్షిణి ప్రియకు సన్మానం
Chintoor: నీట్‌లో ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్ సీటు పొందిన కాక వర్షిణి ప్రియను చింతూరు ఐటీడీఏ పీఓ శుభం నొక్వాల్ సన్మానించి సేవా సమన్ పురస్కారం అందించారు.
Chintoor: ఎంబీబీఎస్ సీటు సాధించిన వర్షిణి ప్రియకు సన్మానం
చింతూరు: నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి NRI మెడికల్ కాలేజీ గుంటూరులో MBBS సీట్ సాధించిన కాక.వర్షిణి ప్రియ ను చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శుభం నొక్వాల్ సన్మానించారు. ఎంబీబీఎస్ లో సీటు సాధించినందుకు ఆమెను ప్రశంసించారు.
ఏజెన్సీ ప్రాంతంలో విద్య,వైద్యం నిరుపేదలకు మరింత చేరువ అయ్యేందుకు సలహాలు సూచనలు తీసుకుంది.ఆదివాసీ ప్రాంతంలో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని వర్షిని ప్రియ అన్నారు.అనంతరం వర్షిణి ప్రియను ప్రాజెక్ట్ అధికారి సన్మానించి, చింతూరు సేవా సమన్ పురస్కారంతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ITDA APO రామతులసి,తల్లిదండ్రులు కాక రాజు,పూజిత, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కణితి శేఖర్,రాష్ట్ర నాయకులు సోడే నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Next Story




