Chintoor: చింతూరులో వినాయక నిబంధనలు జారీ చేసిన పోలీసులు!
Chintoor: చింతూరు మండలంలో వినాయక చవితి మండపాలకు సింగిల్ విండో విధానం ద్వారా ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేసిన సీఐ గోపాలకృష్ణ.
Chintoor: చింతూరులో వినాయక నిబంధనలు జారీ చేసిన పోలీసులు!
Chintoor: చింతూరు మండలంలో వినాయక చవితి సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు ప్రభుత్వ సింగిల్ విండో విధానం ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతులు పొందాలని చింతూరు సీఐ గోపాలకృష్ణ తెలిపారు .
మండపం ఏర్పాటు చేసే ప్రదేశంలో లౌడ్ స్పీకర్లు పెట్టి అర్ధరాత్రి వరకు ప్రజలకు సౌండ్ పొల్యూషన్ చేయరాదని తెలిపారు.నిమజ్జనం వివరాలను దరఖాస్తులో నమోదు చేయాలని తెలిపారు.
ప్రజలు, వాహనదారులకు ఇబ్బంది కలిగేలా రహదారులకు అడ్డంగా మండపాలు ఏర్పాటు చేయరాదన్నారు.ప్రతి మండపం వద్ద కమిటీ సభ్యులు లేదా వాలంటీర్లు అందుబాటులో ఉండాలని సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నిమజ్జనం సమయంలో మద్యం సేవించి శాంతిభద్రతలకు ఆటంకం కలిగించకుండా నిబంధనలు పాటించాలని సీఐ స్పష్టం చేశారు.వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల తరఫున అవసరమైన సహకారం అందిస్తామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు.




