Narsipatnam: ఎంపీ చింతకాయల విజయ్ పూజలు.. 1016 కొబ్బరికాయల మొక్కు!

Narsipatnam: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన చింతకాయల విజయ్ నర్సీపట్నం మరిడి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 Sept 2026 3:05 PM IST
Narsipatnam
X

Narsipatnam: ఎంపీ చింతకాయల విజయ్ పూజలు.. 1016 కొబ్బరికాయల మొక్కు!

Narsipatnam: రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన శ్రీ చింతకాయల విజయ్ గురువారం నర్సీపట్నంలోని శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన రాజ్యసభకు ఎంపికైనందుకు గాను, పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళి అమ్మవారికి 1016 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నారు.

ఈ నేపథ్యంలో ఆలయానికి విచ్చేసిన ఎంపీ విజయ్ తన చేతుల మీదుగా మొదటి కొబ్బరికాయ కొట్టి ఆ మొక్కును చెల్లించారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వేదమంత్రాలు, సన్నాయి మేళంతో ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, ఇంచార్జులు, ముఖ్య కార్యకర్తలు, యువత, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఎంపీ విజయ్ మాట్లాడుతూ, మరిడి మహాలక్ష్మి, నూకాలమ్మ అమ్మవార్లు తమకు ఇంటి ఇలవేల్పులు, గ్రామ దేవతలని స్పష్టం చేశారు. నాయకులు, కార్యకర్తల నమ్మకం, అమ్మవారి ఆశీస్సుల వల్లే తాను రాజ్యసభ సభ్యునిగా ఈ ఉన్నత స్థానంలో ఉన్నానని ఆయన పేర్కొన్నారు.

దేవుడి దయ, అమ్మవార్ల కరుణ వల్లనే నిన్న జరిగిన జయహో బీసీ సభ సైతం వర్షం ఆటంకం లేకుండా విజయవంతమైందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకున్న ఆయన.. తన పదవీకాలంలో ఎక్కడా ఎలాంటి మచ్చ రాకుండా చూసుకుంటానని, నర్సీపట్నం ప్రాంత పేరును ఢిల్లీ స్థాయిలో నిజాయితీగా నిలబెడతానని ఉద్ఘాటించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story