Visakhapatnam: ఆదివాసీల హక్కుల పరిరక్షణకై రాష్ట్ర స్థాయి ఐకాస ఏర్పాటు!

Visakhapatnam: ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గా టీడీపీ నేత చెట్టి అశోక్ చక్రవర్తి నియమితులయ్యారు.

SHIVA, BHIMILI
Published on: 23 July 2026 8:14 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: ఆదివాసీల హక్కుల పరిరక్షణకై రాష్ట్ర స్థాయి ఐకాస ఏర్పాటు!

విశాఖపట్నం: విశాఖపట్నం అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యాలయం వద్ద ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటైనది. ఈ రాష్ట్ర కమిటీకి కన్వీనర్ గా విశాఖపట్నం జిల్లా అఖిల భారత గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షులు సోనాయి అప్పలరాజు వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో ఆదివాసీ హక్కులు పరిరక్షించుకునేందుకు ఒక దృఢమైన సంకల్పంతో

ముఖ్యంగా అన్ని జిల్లాల నుండి, అన్ని సంఘాలనుండి, అన్ని రాజకీయపక్షాలనుంచి సమిష్టమైన సంస్కృతి తో కామన్ ఎజెండా తో అన్ని సంఘాలని ఏకం చేస్తూ ఈ ఐ.కా.స ని ఏర్పాటుచేయడమైందని అప్పలరాజు తెలిపారు. ఆదివాసీల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాపతంగా వివిధ స్థాయిల్లో ఉన్న ఉద్యోగ, విద్యార్ధి, ప్రజా, మహిళా సంఘాల ప్రతినిధులతో కలసి సుమారు వంద మంది ప్రతినిధులతో ఉమ్మడి లక్ష్యంకోసం ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసినట్టు అఖిల భారత గిరిజన సంక్షేమ సంఘం విశాఖ జిల్లా కమిటీ తెలిపింది.

కాగా జి.వి.ఎం.సి రెండవ వార్డ్ టీడీపీ నాయకులు చెట్టి అశోక్ చక్రవర్తి కి స్టేట్ బాడీ లో చోటు దక్కడం విశేషం. విద్యావంతుడు, రాజకీయవేత్త, సుందరమ్మ రామన్న చెట్టి (ఎస్.ఆర్.సి) వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్, P4-భీమిలి నియోజకవర్గం తొలి ఏడాది విజయోత్సవ సభ ప్రశంసాపత్ర గ్రహీత, చెట్టి అశోక్ చక్రవర్తి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ గా మరియు ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర పి.ఆర్ మరియు మీడియా కమిటీ కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. రాజకీయాలకు అతీతంగా ఆదివాసీల సంక్షేమం, మరియు రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై ఏర్పడిన ఈ ఐక్య కార్యాచరణ సమితీలో ముఖ్య పాత్ర పోషించే అవకాశం రావడం అదృష్టంగా మరియు బాధ్యతగా భావిస్తున్నానని చక్రవర్తి తెలిపారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story