Parawada: పరవాడ ఫార్మాసిటీలో రసాయన పొగలు కేసు నమోదు!

Parawada: పరవాడ జేఎన్ ఫార్మాసిటీలో రసాయన డ్రమ్ము నుంచి లీకైన పొగలతో తాడి గ్రామస్థులు తీవ్ర అవస్థలు. వాలరీల్యాబ్స్ యాజమాన్యంపై పోలీసుల కేసు నమోదు.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 7 Sept 2026 10:29 AM IST
Parawada
X

Parawada: పరవాడ ఫార్మాసిటీలో రసాయన పొగలు కేసు నమోదు!

Parawada: పరవాడ జేఎన్ ఫార్మాసిటీలోని వాలరీల్యాబ్స్ ఫార్మా కంపెనీకి చెందిన ఖాళీస్థలంలో నిల్వ ఉంచిన రసాయన డ్రమ్ము నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక్కసారిగా పొగలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. తెల్లని పొగతో కూడిన వాయువులు పరిసరాలతో పాటు తాడి గ్రామంపైకి పెద్దఎత్తున వ్యాపించడంతో గ్రామస్థులు దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ఫార్మా సిటీలోని వాలరీల్యాబ్స్ ఫార్మా సంస్థకు తాడి గ్రామానికి కూతవేటు దూరంలో ప్రహరీతో కూడిన ఖాళీ స్థలం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా సంస్థ ప్రతినిధులు అక్కడ ఆరుబయట పెద్దఎత్తున రసాయన డ్రమ్ములను నిల్వ చేశారు. అందులోని ఒక డ్రమ్ము కిందపడి థయోనైల్ క్లోరైడ్ (టీసీ) రసాయనం నేలపై పడింది.

అదే సమయంలో వర్షం కురవడంతో రసాయన చర్య జరిగి గ్రామస్థులు అసౌకర్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న రాంకీ ఫైర్ సిబ్బంది, కంపెనీ ప్రతినిధులు చేరుకుని ఇసుక, డ్రైకెమికల్ పౌడర్ ను ఉపయోగించి పొగలను అదుపు చేశారు. డ్రమ్మును పొక్లెయిన్ సహాయంతో మట్టి వేసి కప్పివేశారు. సీఐ భాస్కరరావు ప్రమాద స్థలిని పరిశీలించారు.

పెద్దఎత్తున పొగతో కూడిన వాయువులు వ్యాపించాయి. లతాడి గ్రామానికి చేరుకుని స్థానికులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ అపాయం లేదని పోలీసులు తెలిపారు. వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story