Visakhapatnam: క్రీడల్లో కేథరిన్ విద్యాసంస్థల ప్రభంజనం!

Visakhapatnam: SGFI క్రీడా పోటీలలో కేథరిన్ స్కూల్ విశాఖ జిల్లాలో 2వ స్థానం, భీమిలిలో 1వ స్థానం సాధించింది. కలెక్టర్ అభిషేక్ కిషోర్ చేతుల మీదుగా పురస్కారాలు ప్రదానం.

SHIVA, BHIMILI
Published on: 5 Sept 2026 3:17 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: క్రీడల్లో కేథరిన్ విద్యాసంస్థల ప్రభంజనం!

Visakhapatnam: విశాఖపట్నం ఆంధ్రా విశ్వవిద్యాలయం లో జరిగిన కార్యక్రమంలో ఇటీవల జరిగిన వివిధ SGFI వారి జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలలో విద్యార్థులు వివిధ క్రీడల్లో పాల్గొని విశాఖ జిల్లాలో అత్యధిక పాయింట్స్ సాధించినవారిని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ అభిషేక్ కిషోర్, విశాఖ ఎంపీ శ్రీ భరత్ గారు , MLA శ్రీ గణ బాబు గారు, జిల్లా విద్యాశాఖ అధికారీ శ్రీ ప్రేమ కుమార్ గారి చేతులమీదుగా జిల్లాలో క్రీడలలో మొదటి ఐదు స్థానాలు సంపాదించినవారికి బహుమతులు అందించారు.

ఈ జిల్లా ర్యాంకింగ్ లో కేథరిన్ జిల్లాలో 2వ స్థానం, మండలంలో మొదటి స్థానం పొందింది.

చదువులోనూ క్రమశిక్షణలోనూ ముందంజలో ఉండడమే కాకుండా, క్రీడల్లో కూడా తనదైన శైలిలో ఒక ప్రభంజనాన్ని సృష్టించింది కేథరిన్.

ఈ అరుదైన ఘనతను సాధించిందని తెలిసి కేథరిన్ విద్యాసంస్థల అధినేత శ్రీ ఆలివర్ రాయి పాఠశాల వ్యాయామ అధ్యాపక సిబ్బందిని కొనియాడారు.

వివిధ క్రీడలలో విజయాలు సాధించిన వివరాలు -

హ్యాండ్ బాల్

- రాష్ట్రస్థాయిలో అండర్ 14 లో పాల్గొని ధనుస్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.

నెట్ బాల్

అండర్ 17 లో రాష్ట్రస్థాయిలో పాల్గొన్న సుప్రియ (నేషనల్ ప్లేయర్) గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ ను, గాయత్రి సిల్వర్ మెడల్ ను , జే.పార్థసాత్విక్ గోల్డ్ మెడల్ ను, కే.చరణ్ గోల్డ్ మెడల్ ను దక్కించుకున్నారు.

నెట్ బాల్

- అండర్ 19 లో భాగంగా రాష్ట్రస్థాయిలో పాల్గొన్న ఎస్. సుమతి గోల్డ్ మెడల్ సాధించింది.

ఫుట్బాల్

- అండర్ 14 లో భాగంగా రాష్ట్రస్థాయిలో పాల్గొని బీ.జీవన్ ( నేషనల్ ప్లేయర్) గోల్డ్ మెడల్, అఖిల్ గోల్డ్ మెడల్ సాధించారు.

- అండర్ 17 లో భాగంగా ఎస్. సారారుత్ ( నేషనల్ ప్లేయర్) బ్రాంజ్ మెడల్, టి. వేణు బ్రాంజ్ మెడల్, సురేష్ పాల్ బ్రాంజ్ మెడల్ సాధించారు.

బేస్బాల్

• అండర్ 17 లో భాగంగా రాష్ట్రస్థాయిలో పాల్గొని సి.హెచ్. మనోహర్ రెడ్డి బ్రాంజ్ మెడల్, సురేష్ పాల్ బ్రాంజ్ మెడల్ సాధించాడు

క్రికెట్

- అండర్ 17 లో భాగంగా రాష్ట్రస్థాయిలో పాల్గొని ఎస్. చరణ్ తేజ ( నేషనల్ ప్లేయర్) గోల్డ్ మెడల్ సాధించాడు.

- అండర్ 19 లో ఆడిన కౌల్ ( నేషనల్ ప్లేయర్) గోల్డ్ మెడల్ సాధించాడు.

కరాటే

- అండర్ 14 లో భాగంగా రాష్ట్రస్థాయిలో ఆడిన దిబోరా ( నేషనల్ ప్లేయర్) గోల్డ్ మెడల్, కుజిత బ్రాంజ్ మెడల్ సాధించారు.

- అండర్ 17 లో భాగంగా రాష్ట్రస్థాయిలో పాల్గొని లిఖిత బ్రాంజ్ మెడల్ సాధించింది.

ఇన్ని పతకాలు ఒకే పాఠశాలకు రావడం, విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడం అది కేథరిన్ కే సాధ్యమని మరోసారి నిరూపించుకుంది. ఈ సందర్భంగా కేథరిన్ విద్యాసంస్థల అధినేత శ్రీ ఆలివర్ ఆర్ రాయి మాట్లాడుతూ, క్రీడా స్ఫూర్తి అన్నది విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుతుందని విద్యార్థులను సన్మార్గంలో నడిపిస్తుందని తద్వారా చదువు కూడా విద్యార్థుల వశమవుతుందని ఇందుమూలంగా తెలియజేశారు. విద్యార్థులకు మార్కులు మాత్రమే ముఖ్యం కాదని వాళ్ళలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వాళ్ల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయడం అది కేథరిన్ వల్లే సాధ్యమని తెలియజేశారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను మెరుగుపరిచిన వ్యాయామ ఉపాధ్యాయులను కొనియాడుతూ వివిధ రకాల పతకాలను సంపాదించిన విద్యార్థులను అభినందించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story