Kunavaram: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలి: బీజేపీ పిలుపు
Kunavaram: కూనవరం మండలంలో బీజేపీ సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి భాగస్వామ్యంతో సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
Kunavaram: స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలి: బీజేపీ పిలుపు
కూనవరం: కూనవరం మండలం పెద్ద ఆర్కుర్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ సమావేశం ఏర్పాటు చేసి రాబోవు పంచాయితీ ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల పై సమీక్ష నిర్వహించారు. మండల అధ్యక్షులు కరక పవన్ కుమార్ మహిళా మోర్చా అధ్యక్షురాలు సోయం సుధారాణి యువమోర్చా అధ్యక్షులు పూనెం సురేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు ఇచ్చారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి ప్రభుత్వం భాగస్వామ్యంతో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని గ్రామపంచాయతీ,స్థానిక ఎన్నికలకు పోటీకి సిద్ధంగా ఉండాలని మండల అధ్యక్షులు కరక పవన్ కుమార్ పిలుపునిచ్చారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నోముల రామారావు, గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పాయం వెంకయ్య మాట్లాడుతూ కార్యకర్తలకు కొన్ని ముఖ్యమైన సూచనలు వివరించారు.
భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ఉంటాయి అని సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొనాలని తెలిపారు.సేవా పక్వాడ అనే కార్యక్రమంకు సంబంధించి నెల రోజుల పాటు సేవ కార్యక్రమాలు చేయాలి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం మనందరికీ నరేంద్ర మోడీ పరిపాలనలో దేశ ప్రజలకు తాను చేస్తున్న అనేక సేవ సంక్షేమ పథకాలు సేవలను గురించి ప్రతి ఒక్కరికి తెలియ చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పాయం వెంకన్న బాబు, మండల ఉపాధ్యక్షులు బి.వి.ఎస్ నారాయణ, మండల కార్యదర్శి మినప శ్రీను, పార్టీ శ్రేణులు పూనెం ప్రసాద్, చిచ్చడి నారాయణ, కారం దారయ్య,గీతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




