Bheemili: పార్టీకి కార్యకర్తలే వెన్నుముక వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు

Bheemili: భీమిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సన్నాహక సమావేశం. పార్టీకి కార్యకర్తలే వెన్నుముకని స్పష్టం చేసిన విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు.

SHIVA, BHIMILI
Published on: 11 Sept 2026 11:39 PM IST
Bheemili
X

Bheemili: పార్టీకి కార్యకర్తలే వెన్నుముక వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు

భీమిలి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే అసలైన వెన్నుముక అని, నాయకులు వచ్చినా పోయినా పార్టీ చెక్కుచెదరదని విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు కె.కె.రాజు స్పష్టం చేశారు. జీవీఎంసీ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 98 వార్డులకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

​ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...

గ్రామీణ, అర్బన్ ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను సేకరిస్తున్నామని, రేపు (మధ్యాహ్నం 3 గంటలకు) తగరపువలస శ్రీనివాస కళ్యాణ మండపంలో జరిగే భీమిలి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.తాగునీరు సహా ఇతర ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

​నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయకుమార్ మాట్లాడుతూ ఐక్యతతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.కార్యక్రమంలో చెన్నదాస్, పోతిన హనుమంతరావు, పోతిన శ్రీనివాసరావు, కొండలరావు, అక్కరమని రామునాయుడు, మారుతీ ప్రసాద్, పోలిరెడ్డి, జగపల్లి ప్రసాద్, పోతిన ప్రసాద్ రావు, జగపల్లి నరేష్, కరుణాకర్ రెడ్డి, కర్రి స్వామి, కోలుసు ఈశ్వర్ రావు,పిల్ల సుజాత,ముదుండి రాజేశ్వరి,పద్మావతి బెందళం, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI