Visakhapatnam: భీమిలి నియోజకవర్గంలో రూ.21.2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!
Visakhapatnam: ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 31 మంది లబ్ధిదారులకు రూ.21.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.
Visakhapatnam: భీమిలి నియోజకవర్గంలో రూ.21.2 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ!
విశాఖపట్నం, ఆగస్టు 24: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 31 మందికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రూ.21.2 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో సోమవారం అందజేశారు. జీవీఎంసీ 2, 3, 4, 5, 6, 7, 8, 98 వార్డులకు చెందిన 15 మందికి రూ. 9,92,025 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఆనందపురం మండలానికి చెందిన 8 మందికి రూ. 4,46,883.. భీమిలి మండలంలో ఐదుగురికి రూ.4,30,747.. పద్మనాభం మండలానికి చెందిన ఇద్దరికి రూ.1,67,217.. ల చెక్కులు అందించారు.
విజయనగరం జిల్లాకు చెందిన ముని రాజేశ్వరికి రూ.83,359 చెక్కు ఇచ్చారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు పంచకర్ల సందీప్, కూటమి నాయకులు చిక్కాల విజయ్ బాబు, సరగడ అప్పారావు, కసిరెడ్డి దామోదరరావు, కోరాడ రమణ, మొల్లి లక్ష్మణరావు, నాగోతి సత్యనారాయణ, గంటా నూకరాజు, కానూరు అచ్యుతరావు, పిల్లా వెంకట్రావు, శాఖారి శ్రీనివాస్, లొడగల అప్పారావు, చెట్టుపల్లి గోపీ, పాసి నరసింగరావు, కాళ్ల నగేష్ కుమార్, చెట్టుపల్లి సన్యాసిరావు, మీసాల సత్యనారాయణ, అనిల్ ప్రసాద్, గరికిన ఎల్లాజీ, కనకల అప్పలనాయుడు, కోరాడ వైకుంఠం, నాగోతి సూర్య ప్రకాష్, బోయి రమాదేవి, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.




