Bheemili: ఆంధ్రా బాప్టిస్ట్ సంఘ అభివృద్ధికి సహకారం: ఎమ్మెల్యే గంటా

Bheemili: భీమిలి ఎమ్మెల్యే గంటాను బాప్టిస్ట్ సంఘ ప్రతినిధులు కలిశారు. సంఘ అభివృద్ధికి సహకరిస్తామని, భయపెట్టేవారిని నమ్మవద్దని ఆయన హామీనిచ్చారు.

SHIVA, BHIMILI
Published on: 8 Aug 2026 1:03 PM IST
Bheemili
X

Bheemili: ఆంధ్రా బాప్టిస్ట్ సంఘ అభివృద్ధికి సహకారం: ఎమ్మెల్యే గంటా

భీమిలి: ఆంధ్రా బాప్టిస్ట్ సంఘం ప్రతినిధులు భీమిలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, ఆంధ్రా బాప్టిస్ట్ సంఘానికి సంబంధించిన పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా సంఘం అభివృద్ధి, సంఘ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారితో ప్రతినిధులు చర్చించారు.

ఆంధ్రా బాప్టిస్ట్ సంఘం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు హామీ ఇచ్చారు. సంఘ కార్యక్రమాల్లోనూ, సంఘ అభివృద్ధిలోనూ “మీ వెనుకనే నేను ఉన్నాను” అని ఒక ఆత్మీయునిగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.

అదేవిధంగా, కొంతమంది వ్యక్తులు ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారి పేరును ప్రస్తావిస్తూ సంఘ సభ్యులను భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గారు, అటువంటి వ్యక్తుల గురించి సంఘ సభ్యులు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసినట్లు ప్రతినిధులు తెలిపారు.

ఎవరైనా తన పేరును ఉపయోగించుకుని సంఘ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడం లేదా ఒత్తిడికి గురిచేయడం సరికాదని, అలాంటి విషయాలకు భయపడకుండా సంఘ సభ్యులు ఐక్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించినట్లు వారు తెలిపారు.

ఆంధ్రా బాప్టిస్ట్ సంఘం అభివృద్ధి, సంఘ కార్యక్రమాల పురోగతి కోసం అవసరమైన సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు తెలియజేయడం పట్ల సంఘ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని కలిసిన సంఘ ప్రతినిధులు:

శ్రీ కె. ప్రేమానందరావు – మాజీ సెక్రటరీ ఎన్. రవికుమార్ – ప్రస్తుత సెక్రటరీ. శ్రీ ఎం. యమారావు – మాజీ జాయింట్ ట్రెజరర్ శ్రీ జి. ఆనంద్ కుమార్ – మాజీ జాయింట్ సెక్రటరీమరియు తదితరులు

— ఆంధ్రా బాప్టిస్ట్ సంఘం ప్రతినిధులు

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story