Bheemili: భీమిలి కాలేజీ వద్ద ఈవ్-టీజింగ్: 5 గురు అరెస్ట్

Bheemili: ప్రభుత్వ కాలేజీ వద్ద విద్యార్థినులను వేధిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళల భద్రతకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు

SHIVA, BHIMILI
Published on: 4 Aug 2026 6:36 AM IST
Bheemili
X

Bheemili: భీమిలి కాలేజీ వద్ద ఈవ్-టీజింగ్: 5 గురు అరెస్ట్

గవర్నమెంట్ కాలేజీలో ఈవ్-టీజింగ్ చేస్తున్న 5 గురు వ్యక్తుల అరెస్ట్ - కేసు నమోదు..!!

- భీమిలి గవర్నమెంట్ కాలేజీ వద్ద ఆడపిల్లలను ఈవ్-టీజింగ్ చేస్తున్న 5 గురు వ్యక్తులను భీమిలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే సి.ఐ దివాకర్ యాదవ్ ఆదేశాల మేరకు పోలీసులు స్పాట్ కి చేరుకుని నిందితులను పట్టుకున్నారు. మొదట వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

అనంతరం వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.మహిళల భద్రతకు భీమిలి పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని, కాలేజీలు, పాఠశాలల చుట్టూ ప్రత్యేక నిఘా ఉంటుందని సి.ఐ తెలిపారు.

ఎవరైనా ఈవ్-టీజింగ్ కు గురైతే వెంటనే 100 లేదా 181 ఉమెన్స్ హెల్ప్లిన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story