Visakhapatnam: దళితుల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్.. ఆయన బాటే మనకు ఆదర్శం!
Visakhapatnam: విశాఖ 46వ వార్డు కస్తూరి నగర్ లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సంబరాలు. మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు.
Visakhapatnam: దళితుల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్.. ఆయన బాటే మనకు ఆదర్శం!
విశాఖపట్నం: జీవీఎంసీ 46వ వార్డు పరిధి కస్తూరి నగర్ లో గల మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జివన్ విగ్రహం వద్ద బాబు జగజ్జివన్ జయంతి వేడుకలు వార్డు వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షులు బలిరెడ్డి గోవిందరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన విగ్రహం కు పూలమాలలు వేసి స్మరించుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జీవీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. బాబు జగజ్జీవన్ రామ్ దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహానేత అని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
అంతేకాకుండా, ఆయన నిబద్ధత, నిజాయితీ, ప్రజాసేవా తపన ప్రతి నాయకుడికి ఆదర్శమని, యువత ఆయన జీవితం నుండి స్ఫూర్తి పొందాలని సూచించారు. దేశ ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు.
ఈ జయంతి వేడుకలు ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో జీవీఎంసీ మాజి కొ ఆఫ్సన్ మెంబెర్ సేనాపతి అప్పారావు,వార్డు అధ్యక్షులు బలిరెడ్డి గోవిందరాజు, కె. చిన్నా, గ్రామ అధ్యక్షులు మారడుపుడి ఆనంద్, కె ఈశ్వరరావు, కోట రామారావు కే శ్రీను, సీనియర్ నాయకులు,స్థానికులు,కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




