Tagarapuvalasa: అవంతి పాలిటెక్నిక్ కళాశాలల్లో వైభవంగా ప్రెషర్స్ డే వేడుకలు

Tagarapuvalasa: తగరపువలస, భోగాపురం అవంతి పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి.

SHIVA, BHIMILI
Published on: 10 Sept 2026 6:45 PM IST
Tagarapuvalasa
X

Tagarapuvalasa: అవంతి పాలిటెక్నిక్ కళాశాలల్లో వైభవంగా ప్రెషర్స్ డే వేడుకలు

తగరపువలస: తగరపువలస మరియు భోగాపురం ( కౌవులవాడ ) అవంతి పోలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు ప్రెషర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమాన్ని ముఖ్య అతిధులుతో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అవంతి కళాశాలల చైర్మన్, మాజీ మంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావుగారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ , ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన దృష్టిపెట్టాలని, చెడు వ్యసనాలకు దూరంగా, మంచి భవిష్యత్తును ఏర్పాటుచేసుకొని ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలని అలాగే కష్టపడేతత్వం ఉండాలని అభిప్రాయపడ్డారు.

చదువు అనేది నిరంతర ప్రక్రియ, ఇంకా ఎన్నో ఉన్నత చదువులు చదివి సమాజములో మంచి గుర్తుంపు తెచ్చుకోవాలని ఆకాక్షించారు. గౌరవ అతిధిగా శ్రీ జి. సత్యనారాయణ, ప్రిన్సిపాల్, ఎమ్.ఆర్.ఏ.జి.ఆర్, గవర్నమెంట్ పోలిటెక్నిక్ కాలేజ్, విజయనగరం మాట్లాడుతూi పాలిటెక్నిక్ విద్యార్థులకు చాలా ఎక్కువ ఉద్యోగావాకాశములు కలిగి ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచంతో పోటీపడి నైపుణ్యం సాధించేవిధంగా కోర్సులు నేర్చుకోవాలని, మీరు చదువుతో పాటు విలువలు కూడా నేర్చుకోవాలి ఇప్పుడే సమాజంలో మీకు మంచి గౌరవం కలుగుతుందని అభిప్రాయ పడ్డారు.

శ్రీ పొనగంటి సురేష్ బాబు, సీనియర్ ప్రాక్టీస్ లీడ్ ఆఫ్ ఐ.ఇ.ఆర్.పి, ఎస్.ఏ.పి, మౌర్యటెక్ విద్యార్థులను ఉద్దేశించి కృషి, పట్టుదల ఉంటే ఉన్నత శిఖరాలను అందుకోగలరని, అలాగే ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. టెక్స్ట్ బుక్స్ నాలెడ్జ్ పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ను డెవలప్ చేసుకొని ఉన్నతమైన లక్ష్యాలను చేరుకోవాలని హితవు పలికారు.

ముఖ్య అతిధిగా శ్రీ ఎస్. రాఘవులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, చీపురుపల్లి డివిజన్ మాట్లాడుతూ మీరు మంచి మంచి ఆలోచనలు కలిగిఉండాలి. చెడు అలవాట్లకు బానిసకావొద్దు. మీకు మీరే మార్గదర్శకులు కావాలి, మీజీవితం సన్మార్గంలో నడిచి, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని హితవుపలికారు. మాదకద్రవ్యాలు జోలికి మీయువత వెళ్ళవద్దు, మీ జీవితాలకి బంగారుబాట వేసుకోని విజయతీరాలను అందుకోవాలి.

మీ తల్లిదండ్రులుపడే కష్టాన్ని మీరుగుర్తించాలి, వాళ్లకి సమాజంలో మంచిపేరు ప్రఖ్యాతలు మీరే తీసుకురావాలి అని అభిప్రాయము వ్యక్తంచేశారు. శ్రీ కె. కమలాకర్ వైస్ ప్రెసిడెంట్, హెచ్.ఆర్ మరియు అడ్మిన్ మా మహామాయ ఇండస్ట్రీస్ లిమిటెడ్, విశాఖపట్నం విద్యార్థులను ఉద్దేశించి మీరందరూ బాగా కష్టపడి, మంచి నైపుణ్యత సాధించేవిధంగా చదువుకోవాలని అలాగే మీరు కష్టపడి, మంచిగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తును కలిగి ఉండాలని, క్రొత్త, క్రొత్త అలోచనలు కలిగి నూతన ప్రాజెక్టులు తయారు చేసే విధంగా మీ భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు.

ఈకార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా సిస్టర్ తనూజ బ్రహ్మకుమారీస్, విశాఖపట్నం మాట్లాడుతూ మీరు మొదటిరోజు నుండి ప్రణాళిక వేసుకొని చక్కగా ఏరోజు చెప్పిన సబ్జెక్టలను ఆరోజునే మీరు అవలంపు చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కష్టపడేతత్వాన్ని మీరు అలవాటుచేసుకోవాలి. మీ జీవితంలో ధ్యానం, యోగ అనేవి చాలాముఖ్యం. మానసిక, శారీరక ఆరోగ్యం చాలా ముఖ్యం. నేను చాలా శక్తిని కలిగి వున్నాను ఏదైనా సాధించగలను అనే ధైర్యం కలిగి ఉండాలని చెప్పారు. మీరు మీ భవిష్యత్ నిర్మాణం మీ చేతుల్లోనే వున్నది.

మన ఆలోచనలు ఉన్నతమైనవి గా ఉండాలని తెలిపారు. అవంతి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డా. బి. మురళీకృష్ణ గారు మాట్లాడుతూ మీరు ఈ వయసులో కష్టపడి చదవకపోతే జీవితాంతం ఇబ్బందులు పడవలసివస్తుంది. మీరు కూడా బాగా కష్టపడిచదువుకొని మీరే పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని నాఅభిప్రాయం. మీరు టీమ్ బిల్డింగ్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు మీరుచదువుకున్న సంస్థలో ఉన్నత స్థానాన్ని సంపాదించాలని నాఅభిప్రాయం.

ఈ కార్యక్రమములో విద్యార్థులు చేసిన నృత్యాలను, సాంస్కృతిక కార్యక్రమాలను, కేరింతలును చూసి సంతోషం వ్యక్తంచేసారు. విద్యార్థులకు వివిధ రకాలైన ఆటలపోటీలు నిర్వహించినారు. ఈపోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను, షీల్డులను, ప్రశంసాపత్రాలను అందచేశారు. కార్యక్రమములో అవంతి కళాశాల డైరెక్టర్ డా. ఏ. చంద్రశేఖర్ గారు, కళాశాల ఇంచార్జి ముత్తంశెట్టి మహేష్ గారు, తగరపువలస పోలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బి. జగదీశ్వరరావు గారు, విభాగాధిపతి శేషు ఆమిటి గారు, భోగాపురం ( కౌవులవాడ ) ప్రిన్సిపాల్ జి. శ్రీధర్ గారు విభాగాధిపతి కె. హేమ, అధ్యాపకులు, భోదన మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు

SHIVA, BHIMILI

SHIVA, BHIMILI

Next Story