Alluri: రెడ్‌క్రాస్ పనితీరుపై జేసీ తిరుమణి శ్రీపూజ ఉన్నత స్థాయి సమీక్ష!
Alluri: అల్లూరి జిల్లాలో రెడ్‌క్రాస్ సేవా కార్యక్రమాలు, పనితీరుపై జాయింట్ కలెక్టర్, సొసైటీ చైర్మన్ తిరుమణి శ్రీ పూజ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు.
Alluri: రెడ్‌క్రాస్ పనితీరుపై జేసీ తిరుమణి శ్రీపూజ ఉన్నత స్థాయి సమీక్ష!
Alluri Sitharama Raju: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, సొసైటీ పనితీరుపై జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ శ్రీమతి తిరుమణి శ్రీ పూజ, కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కార్యవర్గ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు తదితర కార్యక్రమాలపై వివరాలు తెలుసుకున్నారు. సొసైటీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సమన్వయం, పారదర్శకతతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.
సమీక్షలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలి. సభ్యత్వ రుసుములను నిబంధనల ప్రకారం రాష్ట్ర, జిల్లా వాటాలుగా సంబంధిత ఖాతాల్లో జమ చేయాలి.
కార్యవర్గ సభ్యులు పరస్పర సమన్వయంతో తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలి. పెండింగ్‌లో ఉన్న బిల్లులు, సిబ్బంది జీతాలకు సంబంధించిన అంశాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి.
సొసైటీకి సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలను అంతర్గతంగా సమీక్షించి, సేవా కార్యక్రమాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలి. రెడ్‌క్రాస్ సొసైటీ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జాయింట్ కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో డీఆర్ఓ ఎం.వి.ఎస్. లోకేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొర్రా నాగరాజు, వైస్ చైర్మన్ గంగరాజు, కార్యదర్శి గౌరీ శంకర్రావు, కోశాధికారి సూర్యారావు, కార్యవర్గ సభ్యులు జయలక్ష్మి, ప్రసాద్ నాయుడు, సుబ్రహ్మణ్యం, సంజీవరావు, రవి, శ్రీనివాసరావు, జిల్లా కోఆర్డినేటర్ పూర్ణ తదితరులు పాల్గొన్నారు.




