Visakhapatnam: భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ సామూహిక పారాయణం

Visakhapatnam: విశాఖ మధురవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆరామ ద్రావిడ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో సామూహిక లలితా సహస్రనామ పారాయణం, ప్రత్యేక పూజలు.

JAI RAM, MADURAWADA
Published on: 10 Sept 2026 8:45 PM IST
Visakhapatnam
X

Visakhapatnam: భక్తిశ్రద్ధలతో లలితా సహస్రనామ సామూహిక పారాయణం

విశాఖపట్నం: ఆరామ ద్రావిడ సంఘం విశాఖపట్నం జిల్లా శాఖ ఆధ్వర్యంలో, అధ్యక్షులు బ్రహ్మశ్రీ వేమకోటి సుబ్బలక్ష్మి నరసింహ శర్మ నేతృత్వంలో మధురవాడ నగరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నూతనంగా ఏర్పాటైన మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ లలితాదేవికి సుమారు 50 మంది మహిళలతో లలితా సహస్రనామ సామూహిక పారాయణం నిర్వహించారు. అనంతరం దేవీ ఖడ్గమాల పారాయణం, లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజ తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుంకుమ, పసుపు, పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

శివోపాసకులు, దుర్గోపాసకులైన బ్రహ్మశ్రీ భాస్కరభట్ల లలితా ప్రసాద్ శర్మ, బ్రహ్మశ్రీ దార్లపూడి కైలాసనాథ శర్మ, బ్రహ్మశ్రీ పట్నాల హరి ప్రసాద్ శర్మ వేదోక్త మంత్రాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా సాగింది.

కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి కేంద్ర కార్యదర్శి బ్రహ్మశ్రీ జోస్యుల వెంకట శివ ప్రసాద్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై సన్మానం అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో రేజిటి గురునాథం, నేతేటి ప్రసాద్, భోగాపురం కార్తికేయ శర్మ, మారుతి,దార్ల పూడి అప్పల రాధాకృష్ణ, దంపతులు, భాస్కరభట్ల సత్య ప్రసాద్ శర్మ, పట్నాల హరిప్రసాద్ శర్మ, ఈ కార్యక్రమంకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు నిర్వాహకులు తెలిపారు.

సూమారు 60 మంది మహిళలు పాల్గోన్నారు. మహిళా అధ్యక్షురాలిగా శ్రీమతి మావుడూరు రేవతి, కార్యదర్శిగా శ్రీమతి నేతేటి విజయలక్ష్మీ నియమితులైనారు.

మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతం కావడంతో నిర్వాహకులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

JAI RAM, MADURAWADA

JAI RAM, MADURAWADA

Next Story