Anakapalli: అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: రైతు సంఘం!

Anakapalli: అనకాపల్లి జిల్లాలో తీవ్ర వర్షాభావం నెలకొన్నందున కరువు జిల్లాగా ప్రకటించాలని ఏపీ రైతు సంఘం చోడవరంలో డిమాండ్ చేసింది.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 15 Sept 2026 5:07 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి: రైతు సంఘం!

అనకాపల్లి: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గజపతినగరం గ్రామంలో రైతులతో కలిసి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ వి నాయుడు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాలు పడక తీవ్రమైన కరువు ఏర్పడడంతో రైతులందరూ ఆందోళన చెందుతున్నారని, అనకాపల్లి జిల్లాలో ఉన్న ఖరీఫ్ సీజన్ వరి నాట్లు పరిస్థితి గమనంలో కి తీసుకొని అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని రైతులను కూలీలను ఆదుకోవాలని కోరారు.

ఖరీఫ్ సీజన్ ప్రారంభమై జూన్ నెల నుండి ప్రస్తుతం సెప్టెంబర్ 15వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం535.4 మిల్లి మీటర్లు వర్షపాతం పడవలసి ఉండగా కేవలం 240.4 మిల్లీమీటర్లు వర్షపాతం మాత్రమే పడిందని తెలిపారు.55.1 అతి తక్కువ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని తెలిపారు.

ఇది వర్షపాతం అత్యంత తక్కువ వర్షపాతం అని తెలిపారు. ఇటువంటి తీవ్రమైన వర్షం పరిస్థితులు ఇటీవల ఎన్నడూ లేని దీనిని గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు జిల్లాలో సుమారు 13 లక్షలు ఎకరాలో సాగు వైభాగ్యమైన భూమి ఉంటుండగా దీనివలన 3 లక్షల ఎకరాల ఫారెస్టర్ భూములు కాగా 10 లక్షలు ఎకరాలు సాగు సౌభాగ్యమైన భూమి ఉండగా ఒక లక్ష 30 వేలు ఎకరాల్లో వరి పంట వేయవలసి ఉండగా ప్రస్తుతం కేవలం 12 500 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేశారని అవి కూడా బోరువెల్లర్స్ ఉన్న ప్రాంతంలో మాత్రమే వరి నాట్లు వేస్తారని తెలిపారు తాండవ వరాహ శారద నదిలో నీరు లేక రైతులందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

అనకాపల్లి జిల్లాలో అన్ని మండలాల్లో రైతులు వేసిన వరి నారు మొత్తం వర్షం లేక ఎండిపోతున్నాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం తేలికపాటి పంటలు వేయడానికి కావలసిన విత్తనాలు ఎరువులు ఉచితంగా అందించాలని కోరారు. రైతులకు వ్యవసాయ రుణాలు మొత్తం మాఫీ చేయాలి, కొత్త రుణాలు ఇవ్వాలని కోరారు.

రైతు అడిగిన దగ్గర ఉచితంగా ప్రభుత్వమే బోరువెల్లర్స్ వేయించాలి, పాలు సేకరణ ధరలు పెంచాలి, ఈ బి జి రామ్ జి పథకం ద్వారా ఉపాధి కూలీలకు పనులు కల్పించాలని కూలి రేట్లు ఉపాదామీలో పనిచేస్తున్న ప్రతి 600 రూపాయలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్వీ నాయుడు, సరగడం అప్పారావు రామప్పల నాయుడు, సత్యనారాయణ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM