Visakhapatnam: గిరిజన విద్యార్థులకు ఫిజిక్స్ వాలా ఉచిత ఐఐటీ, నీట్ శిక్షణ!!
Visakhapatnam: గిరిజన గురుకుల విద్యార్థులకు 'ఫిజిక్స్ వాలా'తో ఉచిత ఐఐటీ, నీట్ కోచింగ్: గురుకుల కార్యదర్శి ఎం. గౌతమి ప్రకటన.
Visakhapatnam: గిరిజన విద్యార్థులకు ఫిజిక్స్ వాలా ఉచిత ఐఐటీ, నీట్ శిక్షణ!!
Visakhapatnam: గిరిజన గురుకుల విద్యార్థులకు IIT-JEE, NEET వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ ఏర్పాటు. RFP టెండర్ ద్వారా ఎంపికైన Physics Wallah సంస్థతో ఇంటెన్సివ్ కోచింగ్. విశాఖపట్నం మారికవలస బాలుర గురుకుల పాఠశాల క్యాంపస్‌ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ఎంపిక. మెరిట్ ఆధారంగా ఎంపికైన 300 మంది బాలురు, 300 మంది బాలికలు — మొత్తం 600 మంది ఇంటర్ విద్యార్థులకు శిక్షణ.
విద్యా సంవత్సరం వృథా కాకుండా తక్షణమే కోచింగ్ ప్రారంభించేందుకు నిర్ణయం. విద్యార్థులపై పూర్తి దృష్టి, మెరుగైన పర్యవేక్షణ కోసం ఒకే క్యాంపస్‌లో కేంద్రీకృత శిక్షణ. బాలురు, బాలికలకు ప్రత్యేక తరగతి గదులు, వేర్వేరు డార్మిటరీలు ఏర్పాటు. విద్యార్థుల భద్రత కోసం అదనపు వార్డెన్లు, భద్రతా సిబ్బంది, CCTV కెమెరాలతో పటిష్ట పర్యవేక్షణ. మారికవలసలోని 5–10వ తరగతి విద్యార్థులను సమీప గురుకుల పాఠశాలలకు బస్సులు, ఎస్కార్ట్ సదుపాయంతో సురక్షితంగా తరలింపు.
Physics Wallah అవసరాలకు అనుగుణంగా అదనపు క్లాస్‌రూములు, వసతి, లాజిస్టిక్స్, మౌలిక వసతులు సిద్ధం. EMRS, నవోదయ తరహాలో సహవిద్య ద్వారా విద్యార్థుల్లో మానసిక పరిపక్వత, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అధికారి వెల్లడి.




