Anakapalli: కష్టపడిన వారిని పక్కనపెడితే ఊరుకోం – మలసాల భరత్ కుమార్

Anakapalli: అనకాపల్లి వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ మలసాల భరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల్లో కష్టపడిన స్థానిక నేతలను పక్కనపెడితే సహించేది లేదని హెచ్చరిక.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 10 Sept 2026 10:54 PM IST
Anakapalli
X

Anakapalli: కష్టపడిన వారిని పక్కనపెడితే ఊరుకోం – మలసాల భరత్ కుమార్

అనకాపల్లి: ​ఎన్నికల గెలుపోటముల్లో స్థానిక నాయకుల పాత్ర అత్యంత కీలకమని, కష్టపడిన నాయకులను పక్కనపెట్టి కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తే సహించేది లేదని అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మంచాల భరత్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.

​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎన్నికల్లో పార్టీ సింబల్ తోనూ, పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖచిత్రం చూసి వచ్చే ఓట్లు 95 శాతం ఉంటాయి. కానీ గెలుపును నిర్ణయించే ఆ మిగిలిన 5 శాతం ఓట్లను స్థానిక నాయకులే మేనేజ్ చేస్తారు. అదే అభ్యర్థికి అసలైన మెజారిటీ, అదే విన్నింగ్ మార్జిన్ అవుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.

​కానీ పార్టీలో కష్టపడిన వారిని తక్కువ అంచనా వేసి.. "వీడిదేముందిలే.. తీసి పక్కన పెడదాం" అని భావించడం సరికాదన్నారు. "ఎవరెవరినో తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే.. గత మూడు సంవత్సరాలుగా పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన నాయకుల పరిస్థితి ఏమిటి?" అని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story