Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం పర్యటన
Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం పర్యటన. దళితులు గ్రీవెన్స్ సద్వినియోగం చేసుకోవాలని DVMC మెంబర్ ఎండి రాజు పిలుపు.
Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం పర్యటన
అనకాపల్లి: దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్.జవహర్ ఆదేశాల మేరకు దళితుల సమస్యలు పరిష్కారం వేదిక గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లాలో వివిధ మండలాల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డా!ములకలపల్లి రాజు (ఎం.డి.రాజు) తెలిపారు.
ఈ నెల 18న మంగళవారం ఉదయం 10.30 గంటలకు కె.కోటపాడు తహసీల్దార్ కార్యాలయంలో, మధ్యాహ్నం 12 గంటలకు బుచ్చయ్యపేట తహసీల్దార్ కార్యాలయంలో దళితుల సమస్యలపై సమీక్ష నిర్వహించనున్నారు.
19న చోడవరం ఎంపీడీవో కార్యాలయంలో సమీక్ష కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు.ఈ గ్రీవెన్స్ కార్యక్రమం సామాజిక కుల వివక్ష, భూ సంబంధిత సమస్యలు, గృహాలు, విద్య, ఉపాధి, సంక్షేమ పథకాల అమలు, దళిత గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనా సంబంధించిన సమస్యలపై బాధితులు తమ ఫిర్యాదులను నేరుగా సమర్పించవచ్చని ఎం.డి.రాజు తెలిపారు.
షెడ్యూల్డ్ కులాల ఎస్సీ ఎస్టీ దళితుల తెలిపిన ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఎస్సీ కమిషన్ పరిధిలో అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.సమస్యలు ఉన్న దళితులు తమ ఫిర్యాదులు, సంబంధిత వివరాలతో నిర్ణీత తేదీల్లో ఆయా కార్యాలయాలకు హాజరై గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎం.డి.రాజు కోరారు.




