Anakapalli: అనకాపల్లి జిల్లాలో 2.50 లక్షల మందికి పింఛన్ల పంపిణీ!
Anakapalli: అనకాపల్లి జిల్లాలో 2.50 లక్షల మందికి రూ. 106 కోట్ల పింఛను పంపిణీ. లంచాలు అడిగితే ఫిర్యాదు చేయాలని డీఆర్డీఏ పీడీ శచీదేవి ఆదేశం.
Anakapalli: అనకాపల్లి జిల్లాలో 2.50 లక్షల మందికి పింఛన్ల పంపిణీ!
Anakapalli: అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా మంగళవారం 2,50,725 మంది లబ్ధిదారులకు రూ.106 కోట్ల పింఛను సొమ్మును పంపిణీ చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచే సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేస్తారని డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. జీవీఎంసీ పరిధి, నర్సీపట్నం, ఎలమంచిలి మున్సిపాలిటీలతో పాటు 24 మండలాల్లో ఈ పంపిణీ జరగనుంది. పింఛనుదారులు ఇళ్ల వద్దే అందుబాటులో ఉండాలని ఆమె ఈ సందర్భంగా సూచించారు.
పెన్షన్ ప్రక్రియ లో ఎటువంటి లంచాలకు తావు లేదని...ఎవరైనా లంచం అడిగితే అధికారుల దృష్టి కి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారు.
Next Story




