Anakapalli:శ్రావణ శుక్రవారం వేళ నూకాంబిక ఆలయంలో భక్తుల పోటెత్తు!

Anakapalli: ఉత్తరాంధ్ర ఇలవేల్పు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారికి మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా రెండు లక్షల గాజులతో విశేష అలంకరణ చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 28 Aug 2026 7:48 PM IST
Anakapalli
X

Anakapalli:శ్రావణ శుక్రవారం వేళ నూకాంబిక ఆలయంలో భక్తుల పోటెత్తు!

అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా కొలువుదీరిన శ్రీ అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఆలయంలో మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నూకాంబిక అమ్మవారిని ఏకంగా రెండు లక్షల గాజులతో అత్యంత వైభవంగా ప్రత్యేకంగా అలంకరించారు. రంగురంగుల గాజులతో అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

అమ్మవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో సందడిగా మారాయి. మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన ఈ విశేష అలంకరణ భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story