Anakapalli: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోవిందరావు
Anakapalli: అనకాపల్లిలో శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, టీడీపీ పరిశీలకులు అనంతలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Anakapalli: నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గోవిందరావు
అనకాపల్లి: శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే, అనకాపల్లి నియోజకవర్గ పరిశీలకులు మామిడి గోవిందరావు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. నక్కపల్లిలో జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన, టీడీపీ అనకాపల్లి నియోజకవర్గ పరిశీలకులు అనంతలక్ష్మితో కలిసి అమ్మవారి ఆలయానికి విచ్చేశారు.
ఈ సందర్భంగా అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కి వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
అనంతరం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేద మంత్రాల నడుమ ఆశీర్వచనం అందించి, పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు మాట్లాడుతూ.. శ్రీశ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ పీలా నాగశీను, ధర్మకర్తలు, ఆలయ అర్చకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




