Anakapalli: ప్రజా సమస్యల వినతుల స్వీకరణలో ఎమ్మెల్యే కొణతాల

Anakapalli: అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 24 Aug 2026 9:51 PM IST
Anakapalli
X

Anakapalli: ప్రజా సమస్యల వినతుల స్వీకరణలో ఎమ్మెల్యే కొణతాల

అనకాపల్లి: అనకాపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, అనకాపల్లి ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించారు.

ఈ సందర్భంగా పలువురు స్థానికులు తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు వివరించిన సమస్యలను కొణతాల రామకృష్ణ శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం సంబంధిత అధికారులతో ఆయన ఫోన్‌లో మాట్లాడి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని కొణతాల రామకృష్ణ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి వినతిని పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story