Anakapalli: అనకాపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు!
Anakapalli: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు: అనకాపల్లిలో ఘనంగా మెగా రక్తదాన శిబిరం, కేక్ కటింగ్ చేసిన జనసేన శ్రేణులు.
Anakapalli: అనకాపల్లిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్‌డే వేడుకలు!
Anakapalli: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అనకాపల్లి వేల్పులవీధి కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు.
అనకాపల్లి మాజీ మంత్రి, శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ ప్రోత్సాహంతో మెగా యూత్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, జనసేన ప్రోగ్రాం కమిటీ మెంబర్ శ్రీ సురభి హరీష్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరానికి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కార్యక్రమానికి అనకాపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కీ ముఖ్య అతిథిగా హాజరై రక్తదానం చేసిన వారిని అభినందించారు. రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుందని, సేవా కార్యక్రమాల్లో యువత మరింత చురుగ్గా పాల్గొనాలని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భీమరశెట్టి రామ్కీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సేవా కార్యక్రమం.. జన్మదిన వేడుక. రెండింటినీ కలిపిన ఈ కార్యక్రమం అనకాపల్లిలో జనసేన శ్రేణుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.




