Anakapalli: అనకాపల్లి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి - జీవీఎంసీ కమిషనర్

Anakapalli: అనకాపల్లిలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్‌కు వినతి పత్రం అందజేసిన కూటమి నాయకులు. త్వరలోనే చర్యలని హామీ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 17 Aug 2026 10:35 PM IST
Anakapalli
X

Anakapalli: అనకాపల్లి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలి - జీవీఎంసీ కమిషనర్

అనకాపల్లి: ఈరోజు అనకాపల్లి జోన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించడానికి విచ్చేసిన జీవీఎంసీ కమిషనర్ శ్రీ కేతన్ గార్గ్ IAS గారికి అనకాపల్లి పట్టణంలో చేపట్టాల్సిన ముఖ్యమైన అభివృద్ధి పనులను ఆయన దృష్టికి తీసుకెళ్లి, వాటిపై తక్షణ చర్యలు చేపట్టాలని కూటమి నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది.

ఈ కమిషనర్ దృష్టికి ప్రధానంగా క్రింది అభివృద్ధి పనులను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎన్టీఆర్ విగ్రహం–పూల్‌బాగ్–నూకాంబిక ఆలయం–తోటాడ జంక్షన్ బైపాస్ రోడ్డు వరకు రహదారిని 50 అడుగులకు విస్తరించడంతో పాటు, పూల్‌బాగ్ రోడ్డు నుంచి వంద పడకల ఆసుపత్రి వరకు రహదారిని విస్తరించాలి.

జీవీఎంసీ భవనం, పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలంలోని కంపోస్ట్ యార్డును మరో ప్రాంతానికి తరలించి, అక్కడ ఆధునిక జీవీఎంసీ కార్యాలయ భవనాన్ని నిర్మించాలి. విశాఖ నుంచి అనకాపల్లి వచ్చే బైపాస్ కూడలి, నాగులపల్లి కూడళ్లను ఆధునికంగా అభివృద్ధి చేసి సుందరీకరించాలి.

అనకాపల్లి పట్టణంలోని పలు రోడ్లు, కాలువలను నిర్మించి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలి. జీవీఎంసీ పరిధిలోని పార్కులను ఆధునికీకరించి లైటింగ్, తాగునీటి సదుపాయం, చిన్నారుల ఆట పరికరాలు ఏర్పాటు చేయాలి. జీవీఎంసీ విలీన గ్రామాల్లోని రాజుపాలెం చెరువును అభివృద్ధి చేసి, చెరువుగట్ల సుందరీకరణ, లైటింగ్, వాకింగ్ ట్రాక్, పిల్లల ఆట పరికరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.

జీవీఎంసీ 83వ వార్డు ఏఎంసీ కాలనీలోని భవనాలకు మరమ్మతులు చేపట్టి, అక్కడ నివసిస్తున్న గృహ యజమానుల పేర్లపై మున్సిపల్ పన్ను విధించి ప్రాంతాన్ని సుందరీకరించాలి. జీవీఎంసీ పరిధిలో నిరుపయోగంగా ఉన్న వాణిజ్య సముదాయాలు, కళ్యాణ మండపాలకు వేలం నిర్వహించి వినియోగంలోకి తీసుకురావాలి.

రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం ప్రాంగణంలో చిన్నారుల కోసం ఆట పరికరాలు ఏర్పాటు చేయాలి. జీవీఎంసీ పరిధిలోని సులభ్ కాంప్లెక్స్‌లను ఆధునికీకరించి, వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. ఈ సందర్భంగా పై అంశాలపై సమగ్రంగా పరిశీలించి, త్వరలోనే అభివృద్ధి పనులను చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నూకాంబిక దేవస్థానం చైర్మన్ పీలా నాగ శ్రీను, గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరి, ఎన్టీఆర్ హాస్పిటల్ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, 80వ వార్డు జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బుద్ధ శ్రీనివాసరావు, బర్నికాన రాము, పెంటకోట గణేష్, మారిశెట్టి భాస్కరరావు, దాడి వాసు, కొణతాల సందీప్, పిల్లా సుధాకర్, కాండ్రేగుల గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story