Anakapalli: అలసటకు చెక్.. ప్రమాదాలకు బ్రేక్ కశింకోటలో 'ఫేస్ వాష్' డ్రైవ్!
Anakapalli: కశింకోట వద్ద జాతీయ రహదారిపై పోలీసుల 'ఫేస్ వాష్' కార్యక్రమం. రాత్రివేళ వాహనదారుల అప్రమత్తత, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అవగాహన.
Anakapalli: అలసటకు చెక్.. ప్రమాదాలకు బ్రేక్ కశింకోటలో 'ఫేస్ వాష్' డ్రైవ్!
Anakapalli: రాత్రివేళ జాతీయ రహదారులపై ప్రయాణం చేస్తున్నారా..? అలసటగా అనిపిస్తోందా..? అయితే కాసేపు ఆగి ముఖం కడుక్కొని ఫ్రెష్‌గా ప్రయాణాన్ని కొనసాగించండి.. అంటూ వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పించారు.
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణలో భాగంగా ఐజీపీ శ్రీ గోపీనాథ్ జెట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఆదేశాలతో కశింకోట జంక్షన్ వద్ద ‘ఫేస్ వాష్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రివేళల్లో ఎక్కువ దూరం ప్రయాణించే సమయంలో అలసట కారణంగా డ్రైవర్ల అప్రమత్తత తగ్గే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
దీంతో కొంత దూరం ప్రయాణించిన తర్వాత సురక్షిత ప్రాంతంలో వాహనాన్ని నిలిపి ముఖం కడుక్కొని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ప్రయాణం కొనసాగించాలని సూచించారు.
ఇక రోడ్డు భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వద్దని పోలీసులు స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు. వేగం కంటే ప్రాణాలే ముఖ్యమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వాహనదారులను కోరారు.
అలసటతో డ్రైవింగ్ చేయొద్దు.. అప్రమత్తంగా ప్రయాణించండి.. మీ భద్రతే మా బాధ్యత అంటూ కశింకోట పోలీసులు వాహనదారులకు సందేశం ఇచ్చారు.




