Anakapalli: శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో జనసేన ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రామ్కి

Anakapalli: అనకాపల్లి పట్టణం, కొత్తూరు గ్రామాల్లో నిర్వహించిన శ్రీ కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు, అన్నసమారాధనలో జనసేన ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రామ్కి పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 12 Sept 2026 7:32 PM IST
Anakapalli
X

Anakapalli: శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో జనసేన ఇన్‌ఛార్జ్ భీమరశెట్టి రామ్కి

అనకాపల్లి: శ్రీ కృష్ణాష్టమి నవరాత్రుల సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని విజయరామరాజుపేట, నర్సింగరావుపేటతో పాటు అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామంలోని మొల్లి వారి వీధిలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, భారీ అన్న సమారాధన కార్యక్రమాల్లో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీకృష్ణ స్వామివారిని దర్శించుకున్న రామ్కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా ఉత్సవ కమిటీ సభ్యులు రామ్కిని శాలువాలతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

తదుపరి భారీ అన్న సమారాధన కార్యక్రమాలను రామ్కి ప్రారంభించారు. భక్తులు, స్థానిక ప్రజలతో కలిసి అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో విజయరామరాజుపేట యాదవ సంక్షేమ సంఘం సభ్యులతో పాటు కోన వాసు, బార్ల నాగరాజు, కూటమి నాయకులు, జనసైనికులు, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI