Payakaraopeta: సీఎం చంద్రబాబు అపర భగీరథుడు.. హోం మంత్రి అనిత!
Payakaraopeta: పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించిన హోం మంత్రి అనిత, కలెక్టర్ విజయకృష్ణన్. వచ్చే నెల 3న జలహారతికి ఏర్పాట్లు వేగవంతం.
Payakaraopeta: సీఎం చంద్రబాబు అపర భగీరథుడు.. హోం మంత్రి అనిత!
Payakaraopeta: గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తీసుకువచ్చేందుకు అహర్నిశలు కృషిచేస్తున్న సీఎం చంద్రబాబు అపర భగీరథుడని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అభివర్ణించారు. ఆమె కలెక్టర్ విజయకృష్ణన్తో కలిసి పాయకరావుపేట మండలం సీతారాంపురం, పీఎల్పురం, పాయకరావుపేటల వద్ద చివరి దశలో ఉన్న పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారు.
సీఎం చంద్రబాబునాయుడు వచ్చే నెల 3వ తేదీన ఇక్కడ నిర్వహించే జలహారతి కార్యక్రమానికి చేపడుతున్న ఏర్పాట్లపై అధికారులకు పలుసూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువ వల్ల ఉత్తరాంధ్ర రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు రైతులకు సాగునీటి భద్రత వుంటుందన్నారు.
పోలవరం ఎడమ కాలువ నుంచి తాండవ, వరహా, శారదా నదుల్లోకి నీటి విడుదల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారని, దీంతో ఆయా నదులపై వున్న గ్రోయిన్లు, ఆనకట్టల ద్వారా వేలాది ఎకరాలకు పుష్కలంగా నీరు సరఫరా అవుతుందని మంత్రి చెప్పారు. ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్పటేల్,, పోలవరం ఎస్ఈ ఏసుబాబు, అడ్డరోడ్డు జంక్షన్ ఆర్డీఓ రామలక్ష్మి, అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు.




