Anakapalli: నూతన గ్రంథాలయానికి రూ. 6.25 లక్షల పుస్తకాలు విరాళం!
Anakapalli: నూతన గ్రంథాలయానికి 'ఈసై ఇండియా' సీఎస్ఆర్ కింద రూ. 6.25 లక్షల విలువైన 2,564 పుస్తకాలను విరాళంగా ఇచ్చింది. కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు.
Anakapalli: నూతన గ్రంథాలయానికి రూ. 6.25 లక్షల పుస్తకాలు విరాళం!
Anakapalli:జిల్లాలో కొత్తగా నిర్మించిన గ్రంథాలయానికి ప్రముఖ ఫార్మా సంస్థ ‘ఈసై ఇండియా’ (Eisai India) తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద రూ. 6.25 లక్షల విలువైన పుస్తకాలను విరాళంగా అందజేసిందని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.*
రూ. 6,25,949.32 విలువ కలిగిన మొత్తం 2,564 పుస్తకాలను సంస్థ అందించిందని, విద్యా, సమాచార మరియు వినోద రంగాలకు చెందిన వివిధ అంశాలపై ఉన్న పుస్తకాలను విద్యార్థులు, యువత మరియు సాధారణ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేశారని కలెక్టర్ తెలిపారు. గ్రంథాలయానికి పుస్తకాలు కావాలని మే 18, 2026న వచ్చిన అభ్యర్థనకు స్పందిస్తూ ఈసై ఇండియా ఈ సాయం అందజేసింది అని తెలిపారు.
నాణ్యమైన పఠన విద్యార్థుల విద్యను, జ్ఞానాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపిన సంస్థ, జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ పి.కె.పి. ప్రసాద్, ఈసై ఇండియా’ ప్రతినిధులు పాల్గొన్నారు.




