Anakapalli: ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌కు రాఖీ కట్టిన కలెక్టర్ విజయకృష్ణన్

Anakapalli: అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాకలో రాఖీ పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌కు కలెక్టర్ విజయకృష్ణన్ రాఖీ కట్టారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 28 Aug 2026 5:57 PM IST
Anakapalli
X

Anakapalli: ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌కు రాఖీ కట్టిన కలెక్టర్ విజయకృష్ణన్

అనకాపల్లి: యలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాక గ్రామంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆత్మీయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయ్‌కుమార్‌కు అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయత, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సోదర, సోదరీమణుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే పవిత్రమైన పండుగగా రాఖీ పౌర్ణమిని అభివర్ణించారు.

అనకాపల్లి జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కలెక్టర్ విజయకృష్ణన్ చేస్తున్న కృషిని ఎమ్మెల్యే విజయ్‌కుమార్ అభినందించారు. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలులో అధికారులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన ఈ ఆత్మీయ కార్యక్రమం సోదరభావాన్ని చాటుతూ సందడిగా సాగింది. కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story