Chodavaram: : ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య.. దేవరాపల్లిలో ఘటన!

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం మండలానికి చెందిన కోడూరు దివ్య (26) దేవరాపల్లిలో ఆత్మహత్యకు పాల్పడింది.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 17 Jun 2026 7:50 PM IST
Chodavaram
X

Chodavaram: : ప్రేమ విఫలమైందని యువతి ఆత్మహత్య.. దేవరాపల్లిలో ఘటన!

చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అంబేరుపురం గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడు గత పదేళ్లుగా కుటుంబంతో కలిసి విశాఖపట్నంలో నివాసముంటున్నారు. ఆయన చిన్న కుమార్తె కోడూరు దివ్య (26) విశాఖపట్నంలోని ఓ బంగారం దుకాణంలో ఉద్యోగం చేస్తూ ఒక యువకుడిని ప్రేమించినట్లు తెలిసింది. ఈ విషయమై ఇరు కుటుంబాలు మాట్లాడుకుని సంబంధాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాయి.

అప్పటి నుంచి దివ్య మానసిక ఆందోళనకు గురవుతుండటంతో, వారం రోజుల క్రితం తల్లిదండ్రులతో కలిసి దేవరాపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చింది. సాయంత్రం సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న దివ్య చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కుటుంబ సభ్యులు వెంటనే గమనించి క్రిందికి దించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రేమ విఫలమైన కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మరణంపై తమకు ఎటువంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు దేవరపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story