Chodavaram: చోడవరం బీసీ హాస్టల్‌లో అస్వస్థత పాలైన విద్యార్థి

Chodavaram: అనకాపల్లి జిల్లా చోడవరం గోవాడ బీసీ వసతి గృహంలో మెనూ సక్రమంగా అమలు చేయక విద్యార్థి అస్వస్థత. సంక్షేమాధికారిపై చర్యలకు తల్లిదండ్రుల డిమాండ్.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 5 Aug 2026 6:37 PM IST
Chodavaram
X

Chodavaram: చోడవరం బీసీ హాస్టల్‌లో అస్వస్థత పాలైన విద్యార్థి

చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని గోవాడ బి.సి. ప్రభుత్వ వసతి గ్రహంలో విద్యార్థులకు అందించాల్సిన మెనూ సక్రమంగా అమలు చేయకపోవడంతో విద్యార్దులు తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని తల్లి తండ్రులు ఆరోపిస్తున్నారు.

విద్యార్థులకు అందించే పౌస్టికాహరంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నహించేది లేదని రాష్ట్ర ఆహార కమీషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి హెచ్చరించి, 24 గంటలు గడవక ముందే 8 వ తరగతి విద్యార్ది పండ శివ కుమార్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలయ్యాడు. జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం ప్రతీ లబ్ధిదారుడికి నాణ్యమైన ఆహారాన్ని అందించేలా అధికారులు భాధ్యత తీసుకోవాలన్నారు.

వసతి గృహాల్లో విద్యార్థులకు అందించే మెనూ సక్రమంగా అమలు చేయని అధికారులు పై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లి తండ్రులు, ప్రజా సంఘాలు వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు అందాల్సిన పౌష్టికాహారం పక్కతోవ పడుతోందని పేరెంట్స్ కమిటీ ఆరోపిస్తోంది.

మూడు వసతిగృహాలకు ఒకరే సంక్షేమాధికారి కావడంతో, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు విద్యార్థి అనారోగ్యానికి కారణమైన గోవాడ బిసి వసతి గృహ సంక్షేమ అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM

Next Story