Anakapalli: బంగారుమెట్టలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి..ఐదుగురు అరెస్ట్!

Anakapalli: అనకాపల్లి జిల్లా బంగారుమెట్ట శివారులో పేకాట స్థావరంపై బుచ్చయ్యపేట పోలీసుల దాడి. ఐదుగురు అరెస్ట్, రూ.9,060 నగదు స్వాధీనం.

JAGADISH BABU, CHODAVARAM
Published on: 13 Sept 2026 11:21 AM IST
Anakapalli
X

Anakapalli: బంగారుమెట్టలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి..ఐదుగురు అరెస్ట్!

Anakapalli: అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని ​కొత్తకోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.కోటేశ్వరరావు గారి పర్యవేక్షణలో బుచ్చయ్యపేట పోలీసులు పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడి నిర్వహించారు.

​శనివారం సాయంత్రం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుచ్చయ్యపేట ఎస్సై పి.మనోజ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి బుచ్చయ్యపేట మండలం, బంగారుమెట్ట గ్రామ శివారులలో పేకాట ఆడుతున్న స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో బహిరంగ ప్రదేశంలో డబ్బులు పందెంగా కాసి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

​వారి వద్ద నుంచి రూ.9,060/- నగదుతో పాటు 52 పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారిపై గేమింగ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

​మండల పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

JAGADISH BABU, CHODAVARAM

JAGADISH BABU, CHODAVARAM