Anakapalle: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు - 53 కొవ్వొత్తులతో నిరసన
Anakapalle: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అనకాపల్లిలో 53 కొవ్వొత్తులతో 'నిజం గెలిచింది' నిరసన కార్యక్రమం నిర్వహించిన టీడీపీ శ్రేణులు.
Anakapalle: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు - 53 కొవ్వొత్తులతో నిరసన
అనకాపల్లి: చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా అనకాపల్లిలో టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఆ చీకటి రోజును గుర్తు చేసుకుంటూ 53 కొవ్వొత్తులతో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచారని టీడీపీ నేతలు ఆరోపించారు.
అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి నిరసన కార్యక్రమం చేపట్టాయి. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు చేసిన రోజుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు.. అనకాపల్లి రైల్వే స్టేషన్ భీముని గుమ్మం అంబేద్కర్ జంక్షన్‌లో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ నిరసన కార్యక్రమం జరిగింది.
చంద్రబాబు నాయుడిపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేసి 53 రోజుల పాటు జైలులో ఉంచారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో 53 కొవ్వొత్తులను వెలిగించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సబ్బవరపు గణేష్ మాట్లాడుతూ.. విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమంగా అరెస్టు చేయించారని ఆరోపించారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించి రాజకీయంగా వేధించిందని విమర్శించారు.
చంద్రబాబును అరెస్టు చేసినా.. ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని ఎవరూ చెరపలేకపోయారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందని నినదిస్తూ 53 కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భీముని గుమ్మం టీడీపీ వార్డు అధ్యక్షుడు సిమ్మిటి రామకృష్ణ, గొర్లి బాలసుబ్రహ్మణ్యం, నేతల రాము, యల్లబెల్లి కనక అప్పారావు, రాజబాబు, కిరణ్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.




