Anakapalle: సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ సీఎం రమేష్!
Anakapalle: అనకాపల్లి జిల్లా అభివృద్ధి ప్రాజెక్టులు మరియు స్థానిక సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఎంపీ సీఎం రమేష్ కలిశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Anakapalle: సీఎం చంద్రబాబును కలిసిన ఎంపీ సీఎం రమేష్!
Anakapalle: రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి.ఎం. రమేష్ మంగళవారం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రితో సుదీర్ఘంగా చర్చించారు.
నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టుల వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, వాటి ప్రాధాన్యత, వాటి ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు.
అదేవిధంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు స్థానిక సమస్యలను సీఎం రమేష్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు.అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు.
నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపినట్లు ఎంపీ గారు పేర్కొన్నారు.




