Anakapalle: తండ్రి ఆశయాన్ని నెరవేర్చలేని వ్యక్తి జగన్!

Anakapalle: వైఎస్సార్ కలలు కన్న పోలవరం ప్రాజెక్టును వైఎస్ జగన్ పూర్తి చేయలేకపోయారని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విమర్శలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Sept 2026 5:39 PM IST
Anakapalle
X

Anakapalle: తండ్రి ఆశయాన్ని నెరవేర్చలేని వ్యక్తి జగన్!

Anakapalle: జగన్ పై సంచన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొణతాల, తండ్రి ఆశయాన్ని నెరవేర్చలేని వ్యక్తి జగన్ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.

​వైఎస్‌ఆర్ కలలు కన్న పోలవరం ప్రాజెక్టును అధికారంలో ఉన్న సమయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయారని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విమర్శించారు. స్థానిక రావు గోపాలరావు కళా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

​ఈ సందర్భంగా కొణతాల మాట్లాడుతూ 1980-81 కాలంలో అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలిసారిగా పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. ఆ తర్వాత 2005లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఈ ప్రాజెక్టుకు తొలి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. వైఎస్ఆర్ కలలు కన్న ఈ ప్రాజెక్టును నేడు సాకారం చేసే దిశగా అడుగులు పడటం ఎంతో శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story