Anakapalle: అనకాపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ!

Anakapalle: అనకాపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ వారి సేవలను అభినందించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 1 Sept 2026 1:18 PM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లిలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ!

Anakapalle: పట్టణ పరిశుభ్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచే కార్యక్రమం అనకాపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు, వస్త్రాలు, నూనెతో పాటు ఇతర సామాగ్రిని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, వస్త్రాలు, నూనె తదితర సామాగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఎండ, వర్షం లెక్కచేయకుండా ప్రజల ఆరోగ్యం, పట్టణ పరిశుభ్రత కోసం పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం, స్థానిక సంస్థలు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు.

కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, APUFIDC చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ, గౌరవ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ మల్ల సురేంద్ర, జీవీఎంసీ జోనల్ కమిషనర్ చక్రవర్తితో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story