Anakapalle: సత్తెమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక పూజలు
Anakapalle: అనకాపల్లి గవరపాలెంలో శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Anakapalle: సత్తెమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక పూజలు
అనకాపల్లి: పట్టణంలోని గవరపాలెంలో కొలువై ఉన్న శ్రీ శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జాతర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీ కొణతాల రామకృష్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేశారు. ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణను ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. గవరపాలెంలో ప్రతి సంవత్సరం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే సత్తెమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం ప్రజల్లో ఆధ్యాత్మికతను పెంపొందిస్తోందన్నారు. అమ్మవారి ఆశీస్సులు అనకాపల్లి నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు, స్థానిక నాయకులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




