Anakapalle: అనకాపల్లిలో రూ.16 కోట్లతో అభివృద్ధి పనులు!

Anakapalle: అనకాపల్లి 82వ వార్డులో రూ.16 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతం. కళ్యాణ మండపాలు, రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI
Published on: 7 Sept 2026 12:29 PM IST
Anakapalle
X

Anakapalle: అనకాపల్లిలో రూ.16 కోట్లతో అభివృద్ధి పనులు!

Anakapalle: అనకాపల్లి పట్టణంలోని 82వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించారు.

అనంతరం అనకాపల్లి జనసేన కార్యాలయంలో 82వ వార్డు కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు రూ.16 కోట్ల వ్యయంతో రెండు కళ్యాణ మండపాలు, డ్రైనేజీలు, రహదారుల నిర్మాణం సహా పలు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అనకాపల్లి అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు.

ఈ సందర్భంగా 82వ వార్డు ప్రజల తరఫున ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “కొణతాల అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే కొణతాల” అంటూ కూటమి నాయకులు ఎమ్మెల్యే సేవలను ప్రశంసించారు.

NAGA SRINIVASARAO,	ANAKAPALLI

NAGA SRINIVASARAO, ANAKAPALLI

Next Story