Paderu: అమరరాజా స్కిల్ సెంటర్‌లో 70 మందికి ఉద్యోగావకాశాలు

Paderu: పాడేరు ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించిన జాబ్ డ్రైవ్‌లో అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా 70 మంది అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు లభించాయి.

SAI, PADERU
Published on: 15 Sept 2026 5:51 PM IST
Paderu
X

Paderu: అమరరాజా స్కిల్ సెంటర్‌లో 70 మందికి ఉద్యోగావకాశాలు

అల్లూరి సీతారామరాజు జిల్లా: పాడేరులోని ఐటీఐలో మంగళవారం అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాల కోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఈ ఉద్యోగ ఎంపిక ప్రక్రియలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులతో పాటు ఫెయిల్ అయిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.13,192/- స్టైఫండ్ అందిస్తూ, చిత్తూరు జిల్లాలోని అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో సుమారు రెండు సంవత్సరాల పాటు శిక్షణ అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

అభ్యర్థులకు నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి, అర్హత సాధించిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఎంపిక చేశారు. అనంతరం పాడేరు ఐటీడీఏ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లు అందజేసి, జాయినింగ్ ప్రక్రియను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీ జి. ప్రశాంత్ కుమార్, ఐటీడీఏ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి ఏం.హేమలత, ఐటీడీఏ ట్రైకార్ అసిస్టెంట్ ఎన్.సీతారామయ్య ,అమర్ రాజా కంపెనీ ప్రతినిధి సత్య ప్రసాద్ గారు, పాటు ఇతర ఐటీడీఏ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ, అమరరాజా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ అందిస్తున్న శిక్షణా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుని భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలను పొందాలని ఆకాంక్షించారు.

SAI, PADERU

SAI, PADERU