Anakapalli: జిఓ 21, 31 రద్దు చేయాలని అనకాపల్లిలో ఏఐటీయూసీ రాస్తారోకో!
Anakapalli: జిఓ 21, 31లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో, మోటార్ కార్మికుల ర్యాలీ, రాస్తారోకో. కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేత.
Anakapalli: జిఓ 21, 31 రద్దు చేయాలని అనకాపల్లిలో ఏఐటీయూసీ రాస్తారోకో!
Anakapalli: ఆటో, మోటార్ కార్మికులపై భారీ జరిమానాలకు కారణమవుతున్న జీవో నెంబర్ 21, 31ను తక్షణమే రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్ అండ్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) అనకాపల్లి జిల్లా సమితి డిమాండ్ చేసింది.
ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎన్టీఆర్ స్టేడియం నుంచి ర్యాలీ నిర్వహించిన కార్మికులు ఫోర్ రోడ్డు జంక్షన్ వద్ద రాస్తారోకో, మానవహారం చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు.
స్త్రీ శక్తి పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిందని, పెట్రోలు, డీజిల్ ధరలు, పన్నులు, ఇన్సూరెన్స్ చార్జీలు పెరగడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు తెలిపారు.
డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 60 ఏళ్లు దాటిన వారికి నెలకు రూ.10 వేల పెన్షన్, ఆదాయం కోల్పోయిన డ్రైవర్లకు జీవన భృతి, పీఎఫ్, ఈఎస్ఐ, ఉచిత వైద్యం, విద్య అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, కోన లక్ష్మణ్, పెద్దిరెడ్డి నాగేశ్వరరావు, కోరిబిల్లి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.




