Aakash: ఆకాష్ 'ఆంతే 2026' ప్రకటన విడుదల రూ. 2.5 కోట్ల స్కాలర్‌షిప్‌లు!
Aakash: విశాఖలో నీట్, జేఈఈ పోటీ పరీక్షల 'ఆంతే 2026' ప్రకటన విడుదల. ఈ పరీక్ష ద్వారా విద్యార్థులు రూ. 2.5 కోట్ల వరకు స్కాలర్‌షిప్‌లు పొందవచ్చు.
Aakash: ఆకాష్ 'ఆంతే 2026' ప్రకటన విడుదల రూ. 2.5 కోట్ల స్కాలర్‌షిప్‌లు!
Aakash: ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఆంతే 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను గురువారం ఉదయం ద్వారకా నగర్ లో ఆవిష్కరించారు. స్టేట్ అకాడమిక్ హెడ్ ఆర్ వి ఎస్ నారాయణమూర్తి, రీజనల్ సేల్స్ గ్రోత్ హెడ్ పింకు ప్రసాద్, విశాఖ రీజినల్ హెడ్ ఈశ్వర ప్రసాద్, పలువురు బ్రాంచ్ ఇంచార్జి లతో కలిసి ఆంతే పోటీ పరీక్ష ప్రకటనను అధికారికంగా విడుదల చేశారు.
ఈ సందర్భంగా స్టేట్ అకాడమిక్ హెడ్ ఆర్ వి ఎస్ నారాయణమూర్తి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు రెండున్నర కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఈ పోటీ పరీక్ష ద్వారా విద్యార్థులు పొందేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.
గడచిన 16 సంవత్సరాల లో సుమారు కోటి మంది అంతే పరీక్ష రాసి లక్షలాదిమంది ప్రతిభావంతులైన విద్యార్థులు నీట్ జేఈఈలలో ర్యాంకులు సాధించారని వెల్లడించారు. అక్టోబరు, నవంబర్ మాసాలలో ఈ పోటీ పరీక్షలు దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాలలో జరుగుతాయి అన్నారు.
ఆకాష్ వెబ్సైట్ ద్వారా 9 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులు అందరూ తమ వివరాలు పరీక్ష కొరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్లైన్ పరీక్షలు అక్టోబర్ 27 నుంచి నవంబర్ ఒకటో తేదీ వరకు జరుగుతాయని ఆఫ్లైన్లో పరీక్షను రాసే వారి కోసం తమ కేంద్రాలతో పాటు వివిధ అదనపు కేంద్రాలలో ఈ ఆఫ్లైన్ పరీక్ష కూడా నిర్వహిస్తామని తెలిపారు.
అక్టోబర్ 11, 25 నవంబర్ ఒకటో తేదీన ఆఫ్లైన్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల పోటీ తత్వానికి సంబంధించి డీటెయిల్ మార్క్స్ రిపోర్టును వారి కి పంపించడం జరుగుతుందని, గడచిన కొన్ని సంవత్సరాలలో తమ వద్ద తర్ఫీదు పొందిన విద్యార్థులు జాతీయస్థాయిలో నీటి జేఈఈ పోటీ పరీక్షలలో ఆల్ ఇండియా పదిలోపు ర్యాంకులు 100 లోపు ర్యాంకులు సాధించారని కాబట్టి విద్యార్థులు ఈ అర్హత పరీక్షను రాసి తమ సమర్థతను నిరూపించుకోవాలని ఆకాష్ విద్యాసంస్థలు ఇచ్చే స్కాలర్షిప్లు పొందాలని కోరారు.




