Paderu: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఘనంగా 9వ జాతీయ పోషణ్ మాహ్

Paderu: అల్లూరి జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఘనంగా 9వ జాతీయ పోషణ్ మాహ్ ఉత్సవాలు. పోషకాహారం, మాతృ శిశు సంరక్షణపై అవగాహన.

SAI, PADERU
Published on: 11 Sept 2026 11:30 PM IST
Paderu
X

Paderu: అంగన్‌వాడీ కేంద్రాల్లో ఘనంగా 9వ జాతీయ పోషణ్ మాహ్

పాడేరు: అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని 2,357 అంగన్వాడీ కేంద్రాల్లో సెప్టెంబర్ 9, 2026 నుంచి అక్టోబర్ 8, 2026 వరకు 9వ జాతీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి, సాధికారిత అధికారిణి తెలిపారు.

ఈ కార్యక్రమాల ద్వారా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని 5,550 మంది గర్భిణీలు, 3,535 మంది బాలింతలు, 56,465 మంది పిల్లలకు ఆహార వైవిధ్యం, ప్రోటీన్ ప్రాముఖ్యత, పోషకాహారం, మాతృ ఆరోగ్యం మరియు శిశు సంరక్షణపై అవగాహన కల్పించనున్నారు.

“హమారీ అంగన్వాడీ – హమారీ జిమ్మేదారీ” ప్రధాన థీమ్‌గా తీసుకుని పోషకాహార వైవిధ్యం, ప్రోటీన్‌ అధికంగా ఉండే ఆహారం, తాజా వేడి వండిన భోజనం తదితర అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ మేళాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, వంటకాల ప్రదర్శనలు, కమ్యూనిటీ భాగస్వామ్య కార్యక్రమాలు చేపట్టనున్నారు.

అదేవిధంగా బాలల ప్రాథమిక అభివృద్ధి, తొలి 1,000 రోజుల ప్రాధాన్యత, *ప్రధానమంత్రి మాతృ వందన యోజన (PMMVY)*పై కూడా ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమాలను సంబంధిత శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు, తల్లిదండ్రులు మరియు కమ్యూనిటీ సభ్యులు చురుకుగా భాగస్వామ్యం కావాలని జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి, సాధికారిత అధికారిణి కోరారు.

SAI, PADERU

SAI, PADERU