Munagapaka: ఎమ్మెల్యే విజయ్ కుమార్ సమక్షంలో జనసేనలోకి వైయస్సార్సీపీ నేతలు
Munagapaka: అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తోటాడ గ్రామానికి చెందిన 15 వైయస్సార్సీపీ కుటుంబాలు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో జనసేన పార్టీలో చేరాయి.
Munagapaka: ఎమ్మెల్యే విజయ్ కుమార్ సమక్షంలో జనసేనలోకి వైయస్సార్సీపీ నేతలు
అనకాపల్లి జిల్లా: మునగపాక: వైసీపీకి మరోసారి షాక్ తగిలింది. మునగపాక మండలం తోటాడ గ్రామంలో వైసీపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. వైసీపీకి చెందిన శరగడం అనిత ఆధ్వర్యంలో 15 కుటుంబాలు స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నూతనంగా పార్టీలో చేరిన వారికి స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, అభివృద్ధి, సంక్షేమం కోసం కూటమి అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి, గ్రామాల అభివృద్ధికి మరింత బాటలు వేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జనసేనలో చేరిన ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం, ఆడారి ప్రసాదు, ఆళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పలువురు వైసీపీకి చెందిన కుటుంబాలు జనసేనలో చేరడం స్థానికంగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.




