Vijayawada: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలి యువజన సంఘాల డిమాండ్!
Vijayawada: పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచి అక్రమ కేసులు ఎత్తివేయాలని విజయవాడ బాలోత్సవ భవన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో యువజన సంఘాలు డిమాండ్ చేశాయి.
Vijayawada: ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య పెంచాలి యువజన సంఘాల డిమాండ్!
Vijayawada: విజయవాడ స్థానిక బాలోత్సవభవన్ నందు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు యం. రమణ అధ్యక్షతన జరిగింది. ముందుగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత కొంత కాలంగా నిరుద్యోగులు పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు సంఖ్య పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ అనేక జిల్లాలో వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
గతంలో హోంమంత్రి ప్రకటించిన 19996 పోస్టులు గురించి ఊసే ఎత్తడం లేదు. తర్వాత ఆర్ధిక శాఖ అనుమతికి పంపిన 11639 పోస్టులు గురించి మాట్లాడకుండా ఇప్పుడు కేవలం 1669 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధం అవ్వడం నిరుద్యోగులను నయవంచన చేయడమే అన్నారు. కూటమి ప్రభుత్వం మొదటి నుంచి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతొందని అన్నారు.
ఎన్నికల ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అని చెప్పి రెండు సంవత్సరాల తర్వాత జాబ్ లెస్ క్యాలెండర్ ఇచ్చి తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ఊరించి ఇప్పుడు కేవల 1669 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడం నిరుద్యోగులను ఎంతవరకు సమంజసం అన్నారు. సంవత్సరాలు తరబడి ప్రిపరేషన్ అవుతున్న నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతొందని అన్నారు.
మొన్న కాకినాడలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులపైన, శ్యామ్ సంస్థ పైన పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య 11639 పెంచాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తుందని తెలిపారు. మంగళవారం లోగా కేసులు ఎత్తివేసి పోస్టులు సంఖ్య పెంచకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
రాష్ట్రంలో గంజాయి మాఫియా రాజ్యమేలుతుందని విచ్చలవిడిగా ప్రజల పై దాడులు చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎటువంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ర్యాలీలు నిర్వహిస్తే వారి పై ఎందుకు కేసులు పెట్టడం లేదన్నారు. అక్రమ కేసులతో ఉద్యమాన్ని అపలేరని అన్నారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందె నాసర్ జీ, ఎఐవైఎఫ్ రాష్ట్ర సహయ కార్యదర్శి మాబు సుభాని, పి. డి. ఎస్. యూ రాష్ట్ర కార్యదర్శి ఐ. రాజేష్, వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, విద్యార్థి, యువజన జెఏసి కన్వీనర్ రామచంద్ర, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దయ రమాదేవిలు మాట్లాడుతూ డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులపైన, శ్యామ్ సార్ పైన పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
నిరుద్యోగ యువత పై పోలీసులు వేధింపులు అపాలని డిమాండ్ చేశారు. కాకినాడ ఇష్యూ లో ముందుగా 20 మంది నిరుద్యోగ అభ్యర్థుల పైన కేసులు పెట్టారని రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో తీసివేశారని గుర్తు చేశారు. తక్షణమే పోస్టుల సంఖ్య పెంచి, అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివ, డివైఎఫ్ఐ నాయకులు గణేష్, నోహిత్ కృష్ణ, గౌస్, ఎఐఎస్ఎఫ్ నాయకులు నాగభూషణం, సాయి, పి డి ఎస్ యూ రాష్ట్ర నాయకులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.




